ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె ఆక్రమణల కూల్చివేత

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నిర్మాణాల తొలిగింపు

By :  Raju
Update: 2024-09-04 04:09 GMT

విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్‌ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. సీఆర్‌జడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపట్టినందున వీటిని కూల్చివేస్తున్నట్లు చెప్పారు. సర్వే నంబర్‌ 1516, 1517, 1519, 1523 లోని స్థలంలో ఈ కాంక్రీట్‌ నిర్మాణాలున్నాయి.భీమిలి జోన్‌ పట్టణ సహాయ ప్రణాళికాధికారి బి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి బీచ్‌ ఒడ్డున హోటల్‌ కోసం వేసిన కాంక్రీట్‌ పిల్లర్స్‌, గోడలు, ఇతర నిర్మాణాలలను తొలిగిస్తున్నారు. కూల్చివేత సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవి అక్రమ కట్టడాలు అంటూ జనసేన కార్పొరేట్‌ పీతల మూర్తియాదవ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ క్రమంలో తాజాగా ఉన్నతన్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నిర్మాణాల తొలిగింపు చేపట్టారు. ఈ తొలిగింపు ప్రక్రియను ఎవరూ అడ్డుకోకపోవడంతో సజావుగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News