తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో నేడు, రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది

By :  Vamshi
Update: 2024-06-27 02:52 GMT

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలుచోట్ల బలమైన ఉపరితల గాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నేడు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చారిక జారీ చేసింది. నేడు హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై చల్లగా ఉంది.వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరించారు.

Tags:    

Similar News