రాష్ట్రంలో మహిళలకు భద్రత ఏది?: సబిత

తెలంగాణ రాష్ట్రంలోమహిళలపై వరుసగా జరుగుతున్న లైంగిక దాడులపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

By :  Raju
Update: 2024-07-31 04:52 GMT

తెలంగాణ రాష్ట్రంలోమహిళలపై వరుసగా జరుగుతున్న లైంగిక దాడులపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతున్నదని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడిన 48 గంటలు గడవకముందే రాష్టరంలో నాలుగు అత్యాచారాలు జరగడం బాధకరమని, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందన్నారు.

అసెంబ్లీలో మహిళల భద్రతపై మాట్లాడిన తర్వాత వనస్థలీపురం పీఎస్‌ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై సామూహిక అత్యాచారం, ఓయూ పీఎస్‌ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అఘాయిత్యం, నల్గొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై అత్యాచారం, నిర్మల్‌ నుంచి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స బస్సులో మహిళపై డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. వరుసగా ఇలాంటి ఘటనలు జరడం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు.  

Tags:    

Similar News