కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థుల మృతి

కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు మృతి చెందారు. రెండు రోజుల కిందట అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలో ఈ ఘటన జరిగింది.

By :  Raju
Update: 2024-08-19 06:54 GMT

కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు మృతి చెందారు. రెండు రోజుల కిందట అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలో అనాథాశ్రమంలో సమోసా తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో ముగ్గురు సోమవారం చనిపోయారు. మృతి చెందిన విద్యార్థులను భవాని, శ్రద్ధ, జాషువాగా గుర్తించారు. మిగతా 24 మందికి నర్సీపట్నం, అనకాపల్లి హాస్పిటల్స్‌లో చికిత్స అందిస్తున్నారు. 

క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి అనాథలు, పేదలకు సంబంధించిన ఆశ్రమం. ఆ ఆశ్రమంలో మొత్తం 80 విద్యార్థులు చదువుకుంటున్నారు. శనివారం వారికి సమోసాలు ఇచ్చారు. తిన్న తర్వాత అందులో 27 మందికి ఫుడ్‌ పాయిజన్‌ అయ్యింది. వీరంతా అస్వస్థతకు గురయ్యారు. వీళ్లంతా తమ ఇళ్లకు వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రమాదం బైటికి వచ్చింది. ఇందులో ముగ్గురు మృతి చెందారు. జాషువా 1వ తరగతి, భవానీ, శ్రద్ధ 3వ తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు మృతి చెందగా.. మరో ఏడుగురు నర్సీపట్నంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ డీఈవో అప్పారావు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News