లైంగిక వేధింపులు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఔట్
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై అధిష్ఠానం సీరియస్
By : Raju
Update: 2024-09-05 08:49 GMT
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను టీడీపీ నుంచి సస్పెండ్ చేసింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నది. ఈ మేరకు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.
ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళ లేఖ రాశారు. ఎమ్మెల్యే వేధింపులను పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలిపారు. రాత్రి సమయంలో మెసేజ్‌లు పంపి వేధించారని లేఖలో ఆమె పేర్కొన్నారు. తిరుపతిలోని భీమా ప్యారడైజ్ హోటల్‌కు పిలిపించి వేధించారని ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.