ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతిచెందారు.

By :  Vamshi
Update: 2024-07-02 15:09 GMT

ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మావోయిస్టులు మృతిచెందారు. ధనంది - కుర్రేవాయ ఫారెస్ట్ ఏరియాలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుందని ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఎదురు కాల్పుల్లో పోలీసులు సురక్షితంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ ఘటన జరిగిన ప్రాంతం కోఖామేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. మావోయిస్టుల కదలికల సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు యాంటీ నక్సలైట్ ఆపరేషన్ నిర్వహించింది.

ఈ సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి.నారాయణపూర్ జిల్లా దండకారణ్యంలో మావోయిస్టుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. అబూజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టుల శిబిరాల సెర్చింగ్ చేసేందుకు 1400 మంది జవాన్లను మోహరింప జేశారు. ఈ క్రమంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు మావోయిస్టులు మధ్య ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయి.

Tags:    

Similar News