మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ మంజూరు

మద్యం కేసులో 17 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ మద్యం విధానం అవినీతి, మనీలాండరింగ్‌ కేసుల్లో బెయిల్‌ ఇచ్చింది.

By :  Raju
Update: 2024-08-09 05:52 GMT

మద్యం కేసులో 17 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నిబంధనలతో కూడిన బెయిల్‌ను అత్యున్నత న్యాయం మంజూరు చేసింది. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని ఆదేశించింది. పాస్‌పోర్టును సరెండర్‌ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని ఆయనను ఆదేశించింది.

ఢిల్లీ మద్యం కేసులో మనీశ్‌ సిసోడియాను సీబీఐ 2023 ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. సీబీఐ, ఈడీ విచారణలో రెండు కేసులు నమోదు చేసింది. ఈ విచారణలో భాగంగా ఢిల్లీలో డిప్యూటీ సీఎంగా ఉండంతో పాటు ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి మనీశ్‌ సిసోడియాను 18 నెలల కిందట మొదట ఈడీ, తర్వాత సీబీఐ అరెస్టు చేసింది. నాటి నుంచి సిసోడియా ట్రయల్‌ కోర్టు నుంచి సుప్రీంకోర్టు మూడుసార్లు వచ్చారు. సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి గైడ్‌లైన్స్‌ విధిస్తూ.. విచారణ వేగవంతంగా జరపాల్సిందేనని.. దీనికి అందరూ సహకరించే విధంగా గతంలో ఆదేశాలు ఇచ్చింది.

గత 18 నెలలుగా సిసోడియా జైలులో ఉన్నారు. ఒక వ్యక్తి నిందితుడిగా ఉన్న సమయంలో కాల పరిమితి లేకుండా ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదని.. విచారణలో పురోగతి లేకపోతే.. పరిమితి దాటాక జైలులో ఉంచలేరు. వారి హక్కులను, వారి స్వాతంత్రాన్ని హరించడమే సుప్రీంకోర్టు జస్టిస్‌ గవాయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అదే సందర్బంలో నిందిడుగా ఉన్న వ్యక్తికి అన్ని హక్కులు ఉంటాయని .. బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం, బెయిల్‌ పొందడం అనేది అతని ప్రాథమిక హక్కుగా పేర్కొన్నది. ఈ విషయాల్లో సీబీఐ గాని, ఈడీగాని ఎలాంటి పొరపాట్లు లేకుండా వ్యవహరించాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

సిసోడియాకు బెయిల్‌ ఇవ్వొద్దన్న దర్యాప్తు సంస్థల వాదనలను తోసి పుచ్చింది. ట్రయల్‌ వేగంగా జరిగేందుకు సిసోడియా సహకరించాలని ఆదేశించింది. విచారణ జాప్యానికి సిసోడియా కారణమన్న ట్రయల్‌ కోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిల్‌ అనేది నియమం... జైలు మినహాయింపు అని గ్రహించాలని పేర్కొన్నది. ఈ విషయాన్ని ట్రయల్‌ కోర్టులు.. హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.  వెంటనే మనీశ్‌ సిసోడియా దాఖలు చేసిన బెయిల్‌ అప్లికేషన్లను అన్నింటిని ఆమోదిస్తున్నామని .. అదే సందర్బంలో కొన్ని నియమ నిబంధనలు విధించింది. ఒక్కొక్కరి తో రూ. 10 లక్షల పూచీ కత్తుతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలని .. సిసోడియా తన పాస్‌ పోర్టును కోర్టకు సరెండర్‌ చేయాలని, ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థల అధికారి ముందు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News