కోల్‌కతా హత్యాచార ఘటన.. సీబీఐ దర్యాప్తు షురూ

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్‌ నిపుణులతో సీబీఐ బృందం పొద్దున కోల్‌కతాకు చేరుకున్నది.

By :  Raju
Update: 2024-08-14 08:52 GMT

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్‌ నిపుణులతో సీబీఐ బృందం పొద్దున కోల్‌కతాకు చేరుకున్నది. ఇప్పటివరకు కేసు దర్యాప్తు చేసిన కోల్‌కతా పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి సమాచారాన్ని సేకరించారు. అనంతరం సీబీఐ అధికారులు ఘటన జరిగిన ఆర్‌జీ కార్‌ హాస్పటల్‌కు వెళ్లారు. అక్కడ సహచర వైద్య విద్యార్థుల నుంచి సమాచారాన్ని సేకరించారు.

దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలకత్తా హైకోర్టు మంగళవారం ఈకేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సత్వరమే స్పందించిన సీబీఐ కేసును మళ్లీ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 

Tags:    

Similar News