సీబీఐకి జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం కేసు

బెంగాల్‌లోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ జూనియర్‌ వైద్యురాలి హత్యాచారం కేసు దర్యాప్తును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

Update: 2024-08-13 10:53 GMT

బెంగాల్‌లోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ జూనియర్‌ వైద్యురాలి హత్యాచారం కేసు దర్యాప్తును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు విచారణ చేసిన రాష్ట్ర పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలను బుధవారం ఉదయం 10 గంటల్లోపు సీబీఐకి అందజేయాలని పోలీసులను ఆదేశించింది. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాల, ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే వైద్యులపై పవిత్రమైన బాధ్యత ఉన్నందున ఆందోళలను విరమించాలని హైకోర్టు సూచించింది.ఈ ఘటనపై కోల్‌కతా పోలీసులు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) నలుగురు ఇతర జూనియర్‌ డాక్టర్లను సోమవారం ప్రశ్నించింది. వీరిలో ముగ్గురు డాక్టర్లు, ఒక ఇంటర్న్‌ కూడా ఉన్నారు. ఇప్పటివరకు దర్యాప్తు మొత్తం సంజయ్‌ రాయ్‌ అనే వ్యక్తిపైనే కేంద్రీకృతమైంది.

మరోవైపు సంచలనం సృష్టించిన జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం ఘటనలో పోస్టు మార్టం నివేదికలో అనేక విషయాలు వెల్లడవుతున్నాయి. వైద్యురాలి అంతర్గత అవయవాల్లో తీవ్ర గాయాలయ్యాయి. థైరాయిడ్‌ కార్టిలైజ్‌ విరిగినట్లు పోస్ట్ మార్టమ్‌ నివేదికలో తేలింది. ఈ ఘటన వేళ ఆర్‌ జీ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ సుదీర్ఘ సుదీర్ఘ సెలవుల్లో వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.

అయితే మృతురాలి మెడ, ఎడమకాలు, మడమ, కుడి చేతి ఉంగరం వేలుపై గాయాలున్నట్లు ప్రాథమిక పోస్ట్‌మార్టమ్‌లో పేర్కొన్నారు. అయితే శరీరంపై గాయాలయ్యాయా? గాయాలు లోతుగా ఉన్నాయా? ఏమైనా ఫ్రాక్చర్స్‌ ఉన్నాయా? తదితర గాయాలపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మృతురాలి కాలర్‌ బోన్‌, కంటిభాగం ఎముకలు విరగాన్ని పోలీసులు తిరస్కరిస్తున్నారు. అసలు మృతురాలి ఒంటిపై గాయాల అసలు స్వాభావం ఏమిటి ? అవి ఎందుకు అయ్యాయి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News