షాద్‌నగర్ గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు..ఆరుగురు మృతి

షాద్ నగర్ సౌత్ గ్లాస్ కంపెనీలో కంప్రెసర్ పేలుడు ధాటికి ఆరుగురు మృతి చెందారు. సుమారు 15 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి

By :  Vamshi
Update: 2024-06-28 14:17 GMT

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో విషాదం జరిగింది. బూర్గులలోని సౌత్ గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. పలువురు కార్మికులకి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మృతి చెందినవారిలో ఒడిశా, బీహార్, యూపీకి చెందిన కార్మికులు ఉన్నారు.

సేఫ్టీ పరికరాలు లేకపోవడం కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏఐటీయూసీ ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ వైస్ ప్రెసిడెంట్ ఎం.శ్రీను ఘటన స్థలాన్ని సందర్శించారు. మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం రూ.20 లక్షలు చెల్లించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశారయి. షాద్ నగర్ ఆర్డీవో ,పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారు. భద్రత పరికరాలు లేకనే ప్రమాదం జరిగిందని కంపెనీలో పనిచేసే లేబర్ తెలిపారు. కార్మికుల జీవితాలతో చెలగాటం అడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఘటనపై సీఎం రేవంత్ తీశారు. మృతుల కుటుంబాలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సానుభూతి తెలియజేశారు.

Tags:    

Similar News