హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్‌ నగరంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దీని విలువ రెండు కోట్లకు పైగా ఉంటుందని అంచనా

By :  Raju
Update: 2024-07-07 09:49 GMT

హైదరాబాద్‌ నగరంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని హైదరాబాద్‌ పోలీసులు డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు 3 కిలోల 982 గ్రాముల బంగారాన్ని బస్సులో తీసుకొస్తుండగా..సమాచారం అందుకున్న డీఆర్‌ఐ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దీని విలువ రెండు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 



Tags:    

Similar News