చిలకలగూడలో కాల్పుల కలకలం

సికింద్రాబాద్‌ పరిధిలోని చిలకలగూడలో కాల్పులు కలకలం సృష్టించాయి. పారిపోతున్న దొంగలపై పోలీస్‌ కానిస్టేబుల్‌ ఒక రౌండ్‌ కాల్పులు జరిపినట్టు తెలిసింది.

By :  Raju
Update: 2024-06-22 08:07 GMT

సికింద్రాబాద్‌ పరిధిలోని చిలకలగూడలో కాల్పులు కలకలం సృష్టించాయి. సెల్‌ఫోన్‌ దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను చూసిన దొంగల ముఠా వారి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పారిపోతున్న వారిపై పోలీస్‌ కానిస్టేబుల్‌ ఒక రౌండ్‌ కాల్పులు జరిపినట్టు తెలిసింది. దీంతో దొంగలముఠా భయంతో ఆగిపోవడంతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read -  అమెరికాలో కాల్పులు..బాపట్ల యువకుడు గోపీకృష్ణ మృతి

కాల్పుల ఘటనలో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దీనిపై స్పందించిన పోలీసులు అకస్మాత్తుగా మిస్‌ ఫైర్‌ అయినట్లు చెప్పారు. ఫైరింగ్‌లో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

Tags:    

Similar News