దళిత మహిళపై దాడి కేసులో డీఐ సహా నలుగురిపై కేసు నమోదు

షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన కేసులో డీఐ రామిరెడ్డి,నలుగురు కేసులో పోలీసులపై మొదటి కేసు నమోదైంది.

By :  Raju
Update: 2024-08-16 06:14 GMT

షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ కేసులో పోలీసులపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి సస్పెన్సన్‌లో ఉన్న డీఐ రామిరెడ్డి, నలుగురు కేసులో పోలీసులపై మొదటి కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాధితురాలు ఈ నెల 11న ఫిర్యాదు చేయడంతో అదే రోజు కేసు నమోదైంది.

జులై 30న దళిత మహిళను, ఆమె భర్తను షాద్‌నగర్‌ డీఐ రామిరెడ్డి, నలుగురు పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. నాగేందర్‌ అనే వ్యక్తి ఇంట్లో చోరీ కేసులో విచారణ కోసమని తీసుకెళ్లిన పోలీసులు మొదట ఆమె భర్తను కొట్టారు. ఆ తర్వాత దళిత మహిళ దుస్తులు తొలిగించి భర్త నిక్కరు తొడిగి లాఠీతో దాడి చేశారు. ఇద్దరు పోలీసులు తొడభాగంపై కాళ్లతో తొక్కుతుండగా..చాతి భాగంలో రబ్బర్‌తో కొట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే పెట్రోలు పోసి తగలబెడతామని బెదిరించారు. అర్ధరాత్రి 2 గంటల వరకు స్పహ తప్పేలా మహిళను హింసించారు. మహిళ కుమారుడి కూడా కొట్టారు.ఆ తర్వాత ఫిర్యాదుదారు నాగేందర్‌ కారులోనే బాధితులను ఇంటికి పంపించారని బాధితులు ఈ నెల 11 పోలీసులకు ఫిర్యాదు చేయగా..అదే రోజు కేసు నమోదైంది. ప్రాణ హాని ఉన్నదని... రక్షణ కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు దళిత మహిళపై దాడి వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది డాక్టర్‌ బి. కార్తీక్‌ నవయన్‌ ఎన్‌హెచ్‌ఆర్‌సీలో గురువారం ఫిర్యాదు చేశారు. బాధిత మహిళపై దాడికి పాల్పడ్డ డీఐ రామిరెడ్డి సహా కానిస్టేబుళ్లను సర్వీస్‌ నుంచి తొలిగించాలని, అరెస్టు చేసి శిక్షించాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసున సీబీఐకి అప్పగించి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని , ఎస్టీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద బాధితులకు పరిహారం కింద ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దాడి వ్యవహారంలో కేసు నమోదు కాగా నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.  

Tags:    

Similar News