విరిగిపడిన కొండచరియలు..50 మంది మృతి

ఇథియోపియాలో దారుణం చోటు చేసుకున్నది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి దాదాపు 50 మంది మృతి చెందారు.

By :  Raju
Update: 2024-07-23 04:09 GMT

ఇథియోపియాలో దారుణం చోటు చేసుకున్నది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి దాదాపు 50 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, పోలీసులు ఉన్నారు. రాళ్లు కూరుకుపోవడంతో మృత దేహాలను వెలికి తీస్తున్నారు.

ఇథియోపియాలోని గోఫా జిల్లాలో మొదట కొండ చరియలు విరిగిపడిన ఘటన చోటుచేసుకున్నది. దీంతో పోలీసులు స్థానికులు సహాయక చర్యలు చేపట్టడానికి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే రెండోసారి కొండ చరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. నిన్న రాత్రి పడిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడి కొంతమంది మరణించారని దక్షిణ ఇథియోపియా ప్రాంతీయ రాష్ట్రంలోని గోఫా జిల్లా ప్రభుత్వ ప్రతినిధి కస్సాహున్ అబయ్నే చెప్పారు.ఈ రోజు ఉదయం రెండోసారి కొండచరియలు విరిగిపడినప్పుడు అక్కడ గుమిగూడిన వారు మరణించారని తెలిపారు. 

Tags:    

Similar News