నాటుసారా తాగి 33 మంది మృతి

తమిళనాడులో నాటుసారా తాగి 33 మంది మృతి చెందిన ఘటన కలకలం సృష్టిస్తున్నది. ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

By :  Raju
Update: 2024-06-20 04:56 GMT

తమిళనాడులో నాటుసారా తాగి 33 మంది మృతి చెందిన ఘటన కలకలం సృష్టిస్తున్నది. తమిళనాడు కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం ప్రాంతంలో మంగళవారం పలువురు సారా తాగి అనారోగ్యానికి గురయ్యారు. వారిలో మరో 60 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా 33 మంది మృతి చెందారు. మరికొంత మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

నాటుసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. నాటుసార ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం స్టాలిన్‌ సీఐడీ విచారణకు ఆదేశించారు. కళ్లకురిచ్చి కలెక్టర్‌పై బదిలీ వేటు వేయడంతో పాటు ఎస్పీని సస్సెండ్‌ చేశారు.ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. ఈ నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను నివారించడంలో విఫలమైన అధికారులపైన చర్యలు తీసుకున్నట్లు సోషల్‌ మీడియా ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News