వైఎస్సార్‌కు నిజమైన వారసులెవరు ?

వైఎస్సార్ తెలుగు నాట అత్యంత ప్రజాదరణ కలిగిన నేత.. ఇప్పుడు వైఎస్సార్‌ బిడ్డలది చెరోదోవ. ఇంతకూ రియల్ రాజకీయ వారసులెవరు?

By :  Vamshi
Update: 2024-07-08 11:18 GMT

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన లీడర్.. ముఖ్యమంత్రి పదవిలో మరణించిన నాయకుడు ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తన జనరంజకమైన పాలనతో తెలుగు వారి గుండెలలో చిర స్థాయిగా చోటు సంపాదించుకున్నారు. వైఎస్సార్ జీవించి ఉన్న కాలంలో ఆయన వారసులు ఎవరూ అన్న చర్చ ముందుకు రాలేదు. కానీ ప్రస్తుతం జగన్, షర్మిల మధ్య విభేదాలు కారణంగా మళ్లీ ఈ చర్చ మొదలైనంది. రాజశేఖర్‌రెడ్డి మరణించేనాటికి ఆయన కుమారుడు జగన్ కడప ఎంపీగా ఉన్నారు.ఆయనను వైఎస్సార్ రాజకీయ వారసుడిగా ఆయన అభిమానులు కాంగ్రెస్ నేతలు అనుచరులు అంతా భావించారు. దాని ఫలితంగా వైసీపీ ఏర్పాటు అయింది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వరస విజయాలను సాధిస్తూ 151 సీట్లతో 2019లో అధికారంలోకి సైతం వచ్చింది. అప్పటిదాకా వైఎస్సార్ వారసుడిగా జగన్ నే చూసుకుంటూ జనాలు కూడా వచ్చారు. అయితే అయిదేళ్ల జగన్ పాలన తరువాతనే పోలిక మొదలైంది. వైఎస్సార్ ని అభిమానించే నాయకులు కూడా జగన్ ఆయనలా కాదు అనుకుని దూరమయ్యారు.

ఇక ఆయన కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ వారసత్వం కోసం చూస్తున్నారు. పోరాడుతున్నారు. రాజన్న బిడ్డగా తనకు కూడా హక్కులు ఉన్నాయని ఆమె అంటున్నారు. అయితే ఆమె కడప ఎంపీగా పోటీ చేసి కేవలం లక్షన్నర ఓట్లు మాత్రమే సాధించారు. ఆమె కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించినా ఏపీలో ఆ పార్టీ ఎక్కడా పెద్దగా ఎదిగిన దాఖలాలు లేవు ఆమె రాజన్న బిడ్డను అన్న ట్యాగ్ తప్ప సొంతంగా నాయకత్వ లక్షణాలను ఈ రోజుకీ చూపించలేకపోతున్నారు అని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఏపీ బాధ్యతలు చూస్తున్నారు. కాంగ్రెస్ అంటే మహా సముద్రం. వైఎస్సార్ సీఎం కావాలంటేనే 21 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ రోజుకు రాజన్న బిడ్డగా చూసి కాంగ్రెస్ ఆమెకు పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చినా ఆమె రానున్న రోజులలో తన సత్తాను చాటాల్సి ఉంటుంది. తన ఇద్దరు బిడ్డలకు కానీ, భార్య విజయమ్మకు కానీ వారసత్వం గురించి ఎప్పుడైనా వైఎస్సార్‌ చెప్పాడా. నా బిడ్డలు నా రాజకీయ వారసులుగా రావాలని, అందుకోసం మనం ఎందాకైనా పోవాలని ఎప్పుడైనా తన సతీమణి వద్ద అన్నాడా అంటే అటువంటి వేవీ వెతికినా కనిపించవు.రాజ్యాధికారం అంటే ఎవరికీ చేదు కాదు. అధికారం చేపట్టిన వారికి ఆ విషయాలు బాగా తెలుస్తాయి. అధికారం ఉంటే ఎవ్వరూ గుర్తుకు రారు. బంధువులు, మిత్రులు అప్పుడు పెద్దగా కనిపించరు.


ఒక వేళ కనిపించినా నా బిజీలో గుర్తించలేకపోయానని ఒక్క మాటతో అధికారంలో ఉన్న వారు చెప్పి తప్పించుకుంటారు. అన్న అధికారంలో ఉన్నారు. చెల్లి అధికారంలో లేకపోయినా ఒక జాతీయ పార్టీ, అందులోనూ దేశంలో ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర నాయకురాలు. వీరిరువురూ ఎవరికి వారే వైఎస్సార్‌ రాజకీయ వారసులుగా ప్రకటించుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న కొందరు పెద్దలు షర్మిలే నిజమైన వైఎస్సార్‌ వారసురాలంటున్నారు. జగన్‌ను అభిమానించే వారు నిజమైన వారసుడు వైఎస్‌ జగన్‌ మాత్రమే నంటున్నారు. నిజానికి వీరు ఇరువురూ ఆస్తులు పంచుకోవడంలో మాత్రమే వైఎస్‌ఆర్‌ వారసులు. అంతే కాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పంచుకోవడానికి మాత్రం కాదు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తోందంటే ఒకరు అధికారం చేపట్టారు. రెండో వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించలేదు. అంతే తేడా. అదే అధికారంలో భాగస్వామ్యం కల్పించి ఉంటే ఇంతటి రాద్దాంతం జరిగేది కాదు. ఈ గొడవలు వచ్చేవి కావు. ఒకరిపై ఒకరు పోరుకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావు. నిజంగా వీరిలో వైఎస్‌ వారసులు ఎవరు? ఎందులో వీరు వారసులు అనేది రానున్న ఎన్నికల్లో ప్రజల తప్పకుండా తేల్చేస్తారు.

Tags:    

Similar News