మున్నేరులో వరద పెరుగుతోంది.. ఖమ్మం ప్రజలారా జాగ్రత్త

అవసరమైతే మళ్లీ సహాయక శిబిరాలు తెరవండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

Update: 2024-09-07 15:08 GMT

ఖమ్మం నగర వాసులను జీవితాలను అతలాకుతలం చేసిన మున్నేరు ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు శనివారం రాత్రి ఈమేరకు అధికారంగా ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలలో మున్నేరు వాగు ప్రవాహం మళ్లీ పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వరద తీవ్రత ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అవసరమైతే మళ్లీ సహాయక శిబిరాలు తెరవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే అక్కడి నుంచి తరలించే చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు, అధికారులు ప్రభుత్వం ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సహాయం తీసుకోవాలన్నారు. జిల్లా అధికారయంత్రాంగం వెంటనే అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వరద పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు నిరంతరం సేవలు అందించాలన్నారు.

Tags:    

Similar News