సెమీస్‌లో సత్తాచాటి ఫైనల్‌కు వినేశ్‌ ఫొగాట్‌

రెజ్లింగ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్‌ ఫొగాట్‌. భారత్‌ ఖాతాలో మరో పతకం ఖాయం

By :  Raju
Update: 2024-08-06 17:44 GMT

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో మెడల్‌ ఖాయమైంది. 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో యుస్నీలిస్‌ లోపేజ్‌ (క్యూబా)తో జరిగిన పోరులో ఫొగాట్‌5-0 తో ఘన విజయం సాధించింది. ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ చరిత్రలో ఫైనల్‌కు దూసుకెళ్లిన తొలి భారత మహిళగా వినేశ్‌ చరిత్ర సృష్టించింది. బుధవారం జరిగే ఫైనల్‌లో గెలిస్తే ఆమె పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌కు ఇదే మొదటి పతకం కానున్నది.

ఫొగాట్‌ క్వార్టర్స్‌ ఫైనల్‌లోనూ ఇదే దూకుడు ప్రదర్శించింది. ఉక్రెయిన్‌కు చెందిన లివాచ్‌ ఒక్సానాపై 7-5 తేడాతో విజయం సాధించి సెమీస్‌ కు చేరింది. అంతకుముందు ప్రీక్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన జపాన్‌కు చెందిన సునాకీకి వినేశ్‌ షాక్‌ ఇచ్చి ఆమెను 3-2 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. 

ఫొగాట్‌ రియో 2016, టోక్యో 2020 ఒలింపిక్స్‌ క్వార్టర్స్‌ ఫైనల్ లోనే నిష్క్రమించింది. కానీ పారిస్‌ ఒలింపిక్స్‌లో గత చరిత్రను తిరగరాసి ఫైనల్‌కు చేరింది. 

Tags:    

Similar News