నేడు వైఎస్సార్‌ 75వ జయంతి..ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్‌, షర్మిల

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌, షర్మిల నివాళులర్పించారు. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి జగన్‌ పుష్పాంజలి ఘటించారు.

By :  Vamshi
Update: 2024-07-08 05:25 GMT

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్బంగా కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద విజయమ్మ, జగన్, భారతి నివాళులు అర్పించారు.ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్‌ను తల్లి విజయమ్మ ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్, విజయమ్మ కలిసి కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించారు. ఆమెతో పాటు తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు, కోడలు, కూతురు ఉన్నారు. జగన్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఎక్స్‌ (ట్విటర్) వేదికగా ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు.

కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు.ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరివరకూ మా కృషి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు అని ట్వీట్ చేశారు.

ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధికి నివాళులు అర్పించిన ఏపీ కాంగ్రెస్ షర్మిల..నాయకుడు అంటే ఎలా ఉండలో చూపించిన లీడర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని మీడియాతో అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి గొప్ప పరిపాలన అందించారని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వెళ్లనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి, రాత్రికి తిరిగి హైదరాబాద్‌ రానున్నారు. ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ విజయవాడకు వెళ్లనున్నట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాలు వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను చేశారు.

Tags:    

Similar News