రాష్ట్ర బడ్జెట్‌ రూ. 2,91,159 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు.

By :  Raju
Update: 2024-07-25 06:55 GMT

తెలంగాణ శాసనసభ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం రూ. 2,91, 159 కోట్లు. మూలధన వ్యయం రూ. 33,487 కోట్లుగా ప్రతిపాదించారు.

రెవెన్యూ వ్యయం 2,20, 945 కోట్లు, వ్యవసాయానికి రూ. 72, 659 కోట్లు, గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రూ. 723 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ, 2,418 కోట్లు, ఉద్యానవనం శాఖకు రూ. 737 కోట్లు, పశు సంవర్థకం శాఖకు రూ. 1,980 కోట్లు, మెట్రో వాటర్‌ వర్క్స్‌కు రూ, 3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ. 200 కోట్లు, జీహెచ్‌ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు రూ. 3,065 కోట్లు, హెచ్‌ఎండీఏలో మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2024-25లోని ముఖ్యాంశాలు

హోం శాఖ రూ. 9,564 కోట్లు

వ్య‌వ‌సాయం - రూ. 72,659 కోట్లు

వైద్యం, ఆరోగ్యం రూ. 11,468 కోట్లు

నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 22,301 కోట్లు

విద్యారంగం రూ. 21,292 కోట్లు

ట్రాన్స్‌కో, డిస్కంలు రూ. 16,410 కోట్లు

ఆర్ అండ్ బీ రూ. 5,790 కోట్లు

ప‌రిశ్ర‌మ‌ల శాఖ రూ. 2,762 కోట్లు

ఐటీ రంగం రూ. 774 కోట్లు

అడ‌వులు, ప‌ర్యావ‌ర‌ణం రూ. 1,064 కోట్లు

ఉద్యాన‌వ‌నం రూ. 737 కోట్లు

ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌కు రూ. 1,980 కోట్లు

రూ. 500 గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కం కోసం రూ. 723 కోట్లు

గృహ‌జ్యోతి ప‌థ‌కం కోసం రూ. 2,418 కోట్లు

ప్ర‌జా పంపిణీ కోసం రూ. 3,836 కోట్లు

పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి కోసం రూ. 29,816 కోట్లు

ఇందిరా మ‌హిళా శ‌క్తి ప‌థ‌కానికి రూ. 50.41 కోట్లు

జీహెచ్ఎంసీ ప‌రిధిలో కేటాయింపులు ఇలా..

మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్ - రూ. 3,385 కోట్లు

హైడ్రా సంస్థ - రూ. 200 కోట్లు

జీహెచ్ఎంసీలో మౌలిక వ‌స‌తులు క‌ల్ప‌న - రూ. 3,065 కోట్లు

హెచ్ఎండీఏలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న రూ. 500 కోట్లు

విమానాశ్ర‌యం వ‌ర‌కు మెట్రో విస్త‌ర‌ణ రూ. 100 కోట్లు

హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు

మూసీ రివ‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూఏ. 1500 కోట్లు

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ. 1525 కోట్లు

పాత‌బ‌స్తీ మెట్రో విస్త‌ర‌ణ‌కు రూ. 500 కోట్లు

మ‌ల్టీ మోడ‌ల్ స‌బ‌ర్బ‌న్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట‌మ్ రూ. 50 కోట్లు

ఔట‌ర్ రింగ్ రోడ్డుకు రూ. 200 కోట్లు

హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 500 కోట్లు

సంక్షేమానికి కేటాయింపులు ఇలా..

బీసీ సంక్షేమం రూ. 9,200 కోట్లు

ఎస్టీ సంక్షేమం రూ. 17,056 కోట్లు

మైనార్టీ సంక్షేమం రూ. 3,003 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమం రూ. 2,736 కోట్లు

ఎస్సీ సంక్షేమం రూ. 33124 కోట్లు

Tags:    

Similar News