దేవుళ్ళ మీద ఒట్లు.. రైతాంగం గుండెల్లో గునపం పోట్లు

రుణమాఫీపై సీఎం సారు తెలంగాణలోని అన్ని దేవుళ్ల మీద ఒట్లు పెట్టాడు. ఎన్నికలైపోయాక ఒట్లన్నీ గట్ల మీద పెట్టి తెలంగాణ రైతాంగం గుండెల్లో గునపం పోట్లు దించాడు.

By :  Raju
Update: 2024-08-16 07:33 GMT

రుణమాఫీపై సీఎం రేవంత్‌ రెడ్డిది గడికో మాట గందరగోళం. ఆ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చింది ఏమిటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్నది ఏమిటన్నది కనీసం సహచర మంత్రులతోనైనా, లేదా ఉన్నతాధికారులతోనైనా సీఎం సరైన సమాచారం తీసుకుంటున్నారా? లేదా అన్న సందేహాలు ఆయన వ్యాఖ్యలు చూస్తే అర్థమౌతుంది. ఎందుకంటే 2023 డిసెంబర్‌ 9న ఏకకాలంలో రూ. రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి ఆ మాటకు కట్టుబడి లేరు. మూడు దఫాల్లో నిబంధనల పేరుతో కోతలు పెట్టి తమది మాటల ప్రభుత్వం, కోతల ప్రభుత్వమని రేవంత్‌ పదే పదే రుజువు చేసుకుంటున్నారు. రుణమాఫీపై సీఎం జూన్‌ 21 ఏం మాట్లాడారు? ఆగస్టు 15న ఏం మాట్లాడారు? ఈ రెండింటికి ఎక్కడైనా పొంతన ఉన్నదా? అన్నది ఆయన మాటలను బట్టే తెలుసుకోవచ్చు. సంపూర్ణ రుణమాఫీ చేయకపోగా.. రుణమాఫీ అయిపోయిందని హరీశ్‌రావు రాజీనామా చేయాలని బూతులు తిడుతూ.. సవాళ్లు విసరడంపై సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

జూన్‌ 21న

రైతులు తీసుకున్న రుణాలను రూ. 2 లక్షల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదని సీఎం రేవంత్‌రెడ్డి 2024, జూన్‌ 21న మీడియా ముందు చెప్పారు. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపు రూ. 31 వేల కోట్లు అవసరమౌతున్నది.

ఆగస్టు 15న

జులై 18న మొదలుపెడితే ఇయ్యాల ఆగస్టు 15. సరిగ్గా 27రోజుల్లో రూ. 18 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసిన ప్రభుత్వం, పార్టీ ఏదైనా ఉన్నదంటే ఈ దేశంలో ఉన్నదంటే అది కాంగ్రెస్‌ పార్టీనే

ఈ రెండు రోజులుసీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో సీఎం మాటలు వింటే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ సగం మాత్రమే చేసి చేతులు దులుపుకున్నదన్నది స్పష్టమౌతుంది. రుణమాఫీ చేశామని తుతూ మంత్రంతో

కాంగ్రెస్ చేసిన కుతంత్రం బైటపడుతుంది. మొదట చెప్పింది 40వేల కోట్లు..రెండో సారి చెప్పింది 31 వేల కోట్లు.. వాస్తవానికి చేసింది మాత్రం 17,934 కోట్లు. దీనికోసం సీఎం సారు తెలంగాణలోని అన్ని దేవుళ్ల మీద ఒట్లు పెట్టాడు. ఎన్నికలైపోయాక ఒట్లన్నీ గట్ల మీద పెట్టి తెలంగాణ రైతాంగం గుండెల్లో గునపం పోట్లు దించాడు.

Tags:    

Similar News