రైతులకు షాక్‌ ఇవ్వబోతున్న రేవంత్‌ సర్కార్‌

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దేవుళ్ల పేరు మీద ఓట్టు వేసి రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. రుణమాఫీ, రైతు భరోసాపై కండీషన్స్‌ అప్లై అంటున్నారు.

By :  Raju
Update: 2024-06-20 06:05 GMT

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రైతులంతా వెంటనే బ్యాంకులకు వెళ్లి రూ. రెండు లక్షల రుణం తీసుకోవాలని తాము వచ్చాక మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే రూ. 10 వేలు మాత్రమే వస్తాయి. నెల రోజులు ఆగితే మేము వచ్చాక రూ. 15 వేలు వస్తాయన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానాలు నమ్మి ఓట్లు వేసిన నిరుద్యోగులను ఇప్పటికే నట్టేట ముంచిది. ఇప్పుడు రైతులనూ మోసం చేసే విధంగా విధానాలకు రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం.

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో దేవుళ్ల పేరుమీద ఓట్టు వేసి రుణమాఫీ చేస్తామని అన్న రేవంత్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. రుణమాఫీ, రైతు భరోసాపై కండీషన్స్‌ అప్లై అంటున్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ సాధ్యం కాదని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ అంటే తాము చేసి చూపిస్తామన్నారు. ఒక్క ఏడాది తాను దోపిడీ చేయకుండా కడుపుకట్టుకుంటే బ్యాంకర్ల చెల్లించాల్సిన పైసలు ఎడమ చేతితో ఇచ్చేస్తామన్నారు. కానీ ఎన్నికలు ముగిశాయి. మాట మారింది. రుణమాఫీ, రైతు భరోసాపై నిబంధల కత్తి పెడుతున్నది. ఏక కాలంలో రుణమాఫీ చేయడం లేదని సీఎంవో లీకులు ఇస్తున్నది. మొదట రూ. లక్ష వరకు తర్వాత రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేసిన అనంతరం రెండు లక్షల అప్పు ఉన్న వారికి రెండు విడతల్లో మాఫీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

రుణమాఫీ, రైతు భరోసాకు కేంద్ర కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను అధ్యయనం చేసిన ప్రభుత్వం రుణమాఫీ కోసం కేంద్రం మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోనుట్టు సమాచారం. జులైలో కంద్రం ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రుణమాఫీ అమలుకు నిధులను సమీకరించే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నిఎకరాల భూమి ఉన్నా ఒక రైతు 5 ఎకరాలకుమాత్రమే రైతు భరోసా పరిమితం చేయనున్నట్టు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టెడ్‌ అకౌంటెట్లు ఇలా పలు రంగాలకు చెందిన వారు భూముల పై తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదురేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ, రైతు భరోసా విధివిధానాలపై మార్గదర్శకాలనై తుది నిర్ణయానికి రానున్నది.

ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ రైతు బంధు కోసం ట్రెజరీలలో జమ చేసిన రూ. 7500 కోట్లు రైతుల ఖాతాల్లో కి వెళ్లకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్‌ నేతలే. ఎన్నికల ఫలితాల అనంతరం ఆ నిధులను విడుదల చేయకుండా తాత్సారం చేసింది. ఆ నిధులను కాంట్రాక్టర్లకు బిల్లలు చెల్లించడానికి వినియోగించారని విమర్శలు వచ్చాయి.కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో గెలువడం కోసమే అలవికాని హామీలు ఇస్తుందని అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కుతుందని కర్ణాటకలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజీల్‌పై లీటర్‌కు రూ. 3 పెంచింది. బస్సు ఛార్జీలు పెంచబోతున్నామని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఇక్కడ రేవంత్‌ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని వందశాతం అమలు చేయడం లేదని ఇప్పటికే రుజువైంది. రుణమాఫీ, రైతు భరోసాకు ప్రభుత్వం పెట్టనున్న నిబంధనలు చూస్తే రైతులు రాష్ట్ర ప్రభుత్వం పంగనామాలు పెట్టడానికి సిద్ధమైందని తెలుస్తోంది.

Tags:    

Similar News