రేవంత్ ప్రభుత్వంలో మీడియాపై ఆంక్షలు

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి మీడియా నిషేధం

Byline :  Vamshi
Update: 2024-06-14 12:33 GMT

తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక అయిన మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీడియాని లోపలకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనిపై జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాత్రికేయలకు ప్రవేశం ఉండేది. రాష్ట్ర పరిపాలన భవనం సచివాలయంలోనూ మీడియాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. జర్నలిస్టుల పరిస్థితే ఇట్లా ఉంటే సామాన్యులకు ఎలా? ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు.

డిపార్ట్​మెంట్లకు సంబంధించి వర్క్​తో వెళ్లినా.. లోపలి నుంచి పర్మిషన్లు ఇస్తేనే అనుమతి ఇస్తామని సెక్యూరిటీ తేల్చి చెప్పేది. ఉద్యోగులను కూడా ఐడీ కార్డులు చూపించినా అనుమతించలేదు. ఎన్నోసార్లు వెనుదిరిగిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్​లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రజల పక్షాన కలాన్ని, గళాన్ని విన్పించమే తాము చేసిన పాపంలా అనిపిస్తుంది. ఉమ్మడి ఏపీలోనూ ఇలాంటి వివక్ష చూడలేదు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలకు మీడియాపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News