సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ

గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు శనివారం బహిరంగ లేఖ రాశారు.

By :  Vamshi
Update: 2024-06-22 11:43 GMT

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనను, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందన్నారు. క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేరని పేర్కొన్నారు. గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా మంత్రి వర్గ సమావేశం ముగించారు. ఉసూరుమనిపించారని హారీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మీరు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.

నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇస్తామని మాట ఇచ్చారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి మీకు ఓటేశారు. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు దాటింది. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలను ఇచ్చారు తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదాన్నారు. మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అలమటించవలసిన పరిస్థితి తెచ్చారు. గ్రూప్ 1, డిఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బంది కరంగా మారింది. కనీసం వారు చేస్తున్న విజ్ఞప్తిని వినే పరిస్థితిలో కూడా మీ ప్రభుత్వం లేకపోవడం శోచనీయం. బాధ్యతగల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉద్యోగార్థులకు సంబంధించిన కొన్ని కీలకమైన సమస్యలను, బాధలను, వినతులను మీ దృష్టికి తెస్తున్నాను.

వెంటనే ఈ అంశాలపై దృష్టి పెట్టి తగు న్యాయం చేయాలని కోరుతున్నాను. కనీసం వారు చేస్తున్న విజ్ఞప్తిని వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం శోచనీయమన్నారు. మెయిన్స్‌కు 1 : 50 నిష్పత్తిలో కాకుండా, 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో 1:15 గా పేర్కొన్నప్పటికీ, అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారని గుర్తుచేశారు. గ్రూప్ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ 3కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని రేవంత్ మాట ఇచ్చారని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News