మహిళా జర్నలిస్టులపై దాడిని ఖండించిన కేటీఆర్..జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా ?

రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు కొండారెడ్డిపల్లి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు.

By :  Vamshi
Update: 2024-08-22 05:48 GMT

రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం రేవంత్ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై ముఖ్యమంత్రి అనుచరులు దాడి చేయడం దారుణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా ? రుణమాఫీ సరిగా జరిగి ఉంటే.. సీఎంకు అంత భయమెందుకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. వెంటనే కాంగ్రెస్ గుండాలపైన కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలి మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News