కల్కి 2898 ఏడీ పబ్లిక్ టాక్..సినిమా ఎలా ఉందంటే?

మొదటి 30 నిమిషాలు మహాభారతంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా సినిమా నిర్మించారు

By :  Vamshi
Update: 2024-06-27 02:27 GMT

 ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. మూవీ ఆరంభంలో సీన్స్ ఆదిరిపోయాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. మహాభారతంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని కల్కి 2898 ఏడీ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, యాస్కిన్​గా కమల్ హాసన్, భైరవగా ప్రభాస్, సుమతిగా దీపిక పదుకొణె, రోక్సీగా దిశా పటానీ నటించారు. ఇక భైరవ దోస్త్​గా బుజ్జి అనే స్పెషల్ రొబోటిక్​ కారును రూ.7 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరీ వినియోగించారు. ప్రభాస్ సినిమా కావడంతో ఓవర్సీస్​ సహా దేశంలోని అన్ని థియేటర్లలోనూ ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రీమియర్స్​ మొదటి షో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆడియెన్స్​ సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు.

భైరవగా ప్రభాస్‌ను అద్భుతంగా చూపించడంలో నాగ్‌ అశ్విన్‌ సక్సెస్‌ అయ్యాడంటూ నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా కల్కి కథ చెప్పిన విధానం బాగుందని తెలుపుతున్నారు. అయితే, 20 నిమిషాల తర్వాత నుంచి అసలు స్టోరీ ప్రారంభం అవుతుందని వారు చెబుతున్నారు. ఇందులో యానిమేషన్ విజువల్స్‌ కూడా భారీగానే మెప్పించాయి. ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో చెప్పినట్లుగా బుజ్జి పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉన్నట్లు వారు తెలుపుతున్నారు. అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలెట్‌గా నిలుస్తాయంటున్నారు. కమల్‌ హాసన్‌ గెటప్‌ మాత్రం పీక్స్‌లో ఉంటుందని ఆయన పాత్రకు మంచి మార్కులే పడుతాయని అంటున్నారను. ఫైనల్‌గా కల్కితో ప్రభాస్‌ హాలీవుడ్‌లో కూడా తన మార్క్‌ చూపించబోతున్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు.

Tags:    

Similar News