వైద్య శాఖ మంత్రితో జూడాల చర్చలు విఫలం..సమ్మె కొనసాగింపు

త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాలంటూ జూనియ‌ర్ డాక్ట‌ర్లు రాష్ట్ర వ్యాప్తంగా స‌మ్మె బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌తో జూనియ‌ర్ డాక్ట‌ర్లు చ‌ర్చ‌లు విఫలం అయ్యాయి.

By :  Vamshi
Update: 2024-06-24 11:55 GMT

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జుడాల చర్చలు విఫలం అయ్యాయి. కొన్ని అంశాలపై ప్రభుత్వం సానుకులంగా స్పందించిన మరికొన్నింటిపై మరోసారి చర్చించాలని నిర్ణయించాలన్నారు అదేవిధంగా ఆయా అంశాలపై ప్రపోజల్స్‌ను ఉన్నతాధికారులకు పంపినట్లుగా వారు వెల్లడించారు. అప్పటి వరకు సమ్మె యధాతథంగా కొనసాగుతోందని జూడాలు స్పష్టం చేశారు. ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం.. హాస్టల్ వసతి, పని ప్రదేశాల్లో భద్రత పెంచాల రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలు నిలిచిపోయాాయి. గాంధీ, ఉస్మానియా ఇటు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జూడాలు తమ విధులను బహిష్కరించి ఆసుపత్రుల ఎదుట బైఠాయించారు.

తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ పూర్తయిన పీజీలకు ఖచ్చితంగా ప్రభుత్వ సర్వీస్ అనిపెట్టి నెలకు రూ. 2.5లక్షలు ఇస్తామనని చెప్పారు. కానీ, ఇప్పుడు రూ. 92వేలు ఇస్తాం అంటున్నారని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో భద్రతపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. పోలీసులతో భద్రత కల్పించాలని డిమాండ్.పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఎంబీబీఎస్‌ సీట్లలో 15 శాతం ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యార్థులకే దక్కేలా ఉత్తర్వులు ఇవ్వాలి. ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలి.ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని జుడాల ప్రధాన డిమాండ్లు

Tags:    

Similar News