చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్‌కి ఆహ్వానం లేదా ?

బాబు,రేవంత్‌ను లైట్‌గా తీసుకున్నాడా!

Byline :  Vamshi
Update: 2024-06-12 12:34 GMT

ఏపీ సీఎం చంద్రబాబు స్వీకారానికి ఇన్విటేషన్ అందిందా? లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ విషయంపై అటు ఏపీ అధికారుల నుంచి కానీ.. ఇటు తెలంగాణ సర్కార్ నుంచి కానీ స్పష్టత లేదు. ఆనవాయితీ ప్రకారం పక్క రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపిస్తారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ఆహ్వానం అందింది. కాని ఇండియా కూటమిలో ఉన్నము కావున ఆయన హాజరు కావటం లేదని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్.. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న నేపథ్యంలో ఆయన హాజరు కావటం లేదని తెలిసింది. కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలో భాగం కాబట్టి ఒకవేళ ఆహ్వానం అందినా.. ఆయన హాజరు కాకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే విషయమైన రేవంత్ రెడ్డి గత 5 రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు ఆహ్వానం వస్తే తప్పకుండా వెళ్తానని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ఏపీలో టీడీపీ విజయం తర్వాత రేవంత్ చంద్రబాబుకు ఫోన్ కూడా చేశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలపటంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుందామని చెప్పారు. అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఆ దిశగా అడుగులు వేయాలని రేవంత్ భావించారని టాక్. గురుశిష్యులుగా చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి మెలుగుతారు. రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పక్క రాష్ట్రమైన అప్పటి ఏపీ సీఎం జగన్‌తో పాటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కూడా రేవంత్ ఆహ్వానం పంపారు. అయితే ఏపీ నుంచి ఎవరూ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే రేవంత్‌ని ప్రమాణ స్వీకారానికి పిలిస్తే మోదీతో బంధం తెగిపోతుందని బాబు భావించినట్లు టాక్. 

Tags:    

Similar News