హైదరాబాద్ చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు హైడ్రా అధికారులు నోటీసులు

హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు.

By :  Vamshi
Update: 2024-08-25 05:57 GMT

హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. జీవో658కి విరుద్దంగా 225 ఇళ్లు జీ+1కి పర్మిషన్ తీసుకోని జీ+2 కట్టారని తెలిపారు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అధికారులు తెలిపారు. హైడ్రా పరిధిని 111 జీవో పరిధి గ్రామాల వరకు వర్తింపజేయనున్నట్టు తెలుస్తున్నది. దీనికోసం నేడో, రేపో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ కూడా జారీ చేసే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్డినెన్స్‌ జారీ చేసేందుకే అసెంబ్లీని ప్రోరోగ్‌ చేసినట్టు తెలుస్తున్నది. దీంతో 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లోని 84 గ్రామాల్లో నిర్మాణాలపై ఆంక్షలు విధిస్తూ 111 జీవోను తీసుకొచ్చారు.

జీవో వల్ల ఆ పల్లెలన్నీ బఫర్‌ జోన్‌లోకి వెళ్లాయి. అయితే, గత బీఆర్‌ఎస్‌ సర్కారు ఆ జీవోను రద్దుచేసి అక్కడి ప్రజలకు లాభం చేకూర్చింది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో భూముల రేట్లు కూడా పెరిగాయి, క్రయవిక్రయాలు జోరందుకొని నిర్మాణాలు వెలిశాయి. అయితే, ఇప్పుడు ఈ 84 గ్రామాలకు హైడ్రా పరిధిని వర్తింపజేస్తే ప్రస్తుతం ఏర్పాటైన నిర్మాణాల సంగతి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది. అనురాగ్‌ సంస్థలు, గాయత్రి ట్రస్ట్‌ల నిర్మాణాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని ఎమ్మెల్యే, అనురాగ్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. గత పాతిక ఏళ్లలో ఏనాడూ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టలేదు. నాదం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లలో భవనాలు లేవని నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సంయుక్త పరిశీలన చేసి.. నిరభ్యంతర పత్రం ఇచ్చాయి. చట్టానికి లోబడే అన్ని అనుమతులు తెచ్చుకున్నాను.

ప్రభుత్వం నాపై వ్యక్తిగతంగా జనగామ, హైదరాబాద్‌లలో కేసులు పెట్టింది. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఒత్తిడి తెచ్చినా.. అక్రమ కేసులు పెట్టినా చట్టప్రకారం నడుచుకుంటాం’ అని పల్లా అన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా దాదాపు నెలరోజుల్లోనే 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. చెరువుల అక్రమణపై అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ ఫోటోలను తెప్పించుకున్నామని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు. ముందుగానే సిబ్బంది మష్టీలో వెళ్లి భవనాలు సిబ్బంది సిద్దం చేసి ఉదయమే కూల్చివేతలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా నేడు మరి కొన్ని కట్టడాలను కూల్చడానికి ప్లాన్ చేస్తున్నారు

Tags:    

Similar News