పురుషోత్తముడు సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే ?

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ న‌టించిన తాజా చిత్రం పురుషోత్తముడు చిత్రం నేడు విడుదలైంది. రచిత్‌ రామ్‌ క్యారెక్టర్‌లో రాజ్‌తరుణ్‌ చక్కగా ఒదిగిపోయాడు.

By :  Vamshi
Update: 2024-07-26 09:52 GMT

రాజ్‌తరుణ్‌ హీరోగా భీమన దర్శకత్వంలో రూపొందించిన పురుషోత్తముడు మూవీ నేడు విడుదలైంది. ప్రస్తుతం రాజ్‌తరుణ్‌కు గడ్డుకాలం నడుస్తోంది. అటు కెరీర్‌పరంగా సరైన హిట్‌ లేదు, ఇటు వ్యక్తిగత జీవితంలోని వివాదాలు తన ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. ఈ చిత్రం ఎలా ఉందంటే ? రచిత్‌ రామ్‌ (రాజ్‌తరుణ్‌) పుట్టుకతోనే సంపన్నుడు ఇండియలోని గొప్ప బిజినెస్ మేన్ ఒకరైన పీఆర్‌ గ్రూప్స్‌ అధినేత ఆదిత్య రామ్‌ (మురళీ శర్మ) కొడుకు. లండన్‌లో ఎడ్యేకేషన్ పూర్తి చేసుకుని దేశానికి తిరిగొస్తాడు. అతను వచ్చీ రాగానే పీఆర్‌ గ్రూప్స్‌ నూతన సీఈవోగా నియమించాలని ఆదిత్య రామ్‌ నిర్ణయించుకుంటాడు. కానీ, దానికి రచిత్‌ పెద్దమ్మ వసుంధర (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ బైలా ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి ఎవరైనా సరే 100రోజుల పాటు ఓ సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది.

దీంతో రచిత్‌ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. ఈ క్రమంలోనే ఏపీలోని కడియం సమీపంలో ఉన్న రాయపులంక అనే పల్లెటూరికి చేరుకుంటాడు. మరి అక్కడికి వెళ్లాక రచిత్‌ రామ్‌ లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది? ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను.. ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు? రచిత్‌కు.. అమ్ము (హాసినీ సుధీర్‌)కు మధ్య చిగురించిన లవ్ ఎలాంటి మలుపు తిరిగింది? అన్నది మిగిలిన స్టోరి. రామ్ భీమన ఎంపిక చేసుకున్న కథ కొత్తదేమీ కాదు. ‘అరుణాచలం’ ‘శ్రీమంతుడు’ ‘బిచ్చగాడు’ ‘పిల్లజమీందార్’వంటి సినిమాల ఛాయలు చాలా ఈ కథలో కనిపిస్తాయి. కానీ స్క్రీన్ ప్లే పరంగా మంచి మార్కులు వేయొచ్చు.

బి,సి సెంటర్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. వాళ్లకి లాజిక్స్ తో సంబంధం ఏమీ ఉండదు. పడాల్సిన చోట ఫైట్లు, కామెడీ ఉంటే.. వాళ్ళు టైం పాస్ చేసేస్తారు.కాబట్టి వాళ్లకు ఈ సినిమాని నచ్చే విధంగానే తీర్చిదిద్దాడు దర్శకుడు.దర్శకత్వకుడు రాసిన కథలోనూ..తెరపై ఆవిష్కరించడంలోనూ ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు. ఇది ఓ కోణంలో శ్రీమంతుడుకు పాత వెర్షన్‌లా..ఇంకో కోణంలో బిచ్చగాడుకు ఆప్‌డేట్ వెర్షన్‌లా కనిపిస్తుంది. రాజ్‌తరుణ్‌ ఇమేజ్‌కు మించిన కథ కావడంతో అన్నీ అతిగా అనిపిస్తాయి. మొత్తంగా ఈ ‘పురుషోత్తముడు’ రొటీన్ గా అనిపించినా.. టైం పాస్ చేయించే విధంగానే ఉంది. రీసెంట్ టైంలో వచ్చిన రాజ్ తరుణ్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్. బి,సి సెంటర్ ఆడియన్స్ కి నచ్చే అవకాశాలు కూడా ఎక్కువే..!

ఫోకస్ పాయింట్ : ఇది రాజ్ తరుణ్ ‘శ్రీమంతుడు’

రేటింగ్ : 2.5/5

Tags:    

Similar News