గురువారం బైడెన్‌, ట్రంప్‌ మధ్య చరిత్రాత్మక చర్చ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య చరిత్రాత్మక చర్చకు రంగం సిద్ధమైంది. అట్లాంటాలోని సీఎన్‌ఎన్‌ స్టూడియో దీనికి వేదిక కానున్నది.

By :  Raju
Update: 2024-06-25 04:20 GMT

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య చరిత్రాత్మక చర్చకు రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9 గంటలకు బైడెన్‌, ట్రంప్‌ మధ్య ముఖాముఖి చర్చ జరగనున్నది. అట్లాంటాలోని సీఎన్‌ఎన్‌ స్టూడియో దీనికి వేదిక కానున్నది. ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.

అమెరికా చరిత్రలో అధ్యక్ష ఎన్నిక కోసం అత్యంత కీలకమైన చర్చ కోసం రంగం సిద్ధమైంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమోక్రటిక్‌ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యక్షంగా తలపడనున్నారు. జూన్‌ 27వ తేదీన వారిద్దరి మధ్య చర్చ జరగనున్నది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్‌లో పలు కీలకాంశాలపై వీరిద్దరూ తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్‌ ఎఫ్‌ కెనెడీ ఈ డిబేట్‌కు అర్హత సాధించలేదు. ఈ క్రమంలో పలు క్లిష్టమైన ప్రశ్నలను ఎదుర్కొనున్నారు.

ట్రంప్‌పై దూకుడుగా వ్యవహరించాలని బైడెన్‌ కోరుకుంటున్నారు. స్థిరమైన నాయకుడు కావాలో, దోషిగా తేలిన అభ్యర్థి కావాలో తేల్చుకోవాలని బైడెన్‌ ప్రజలను కోరనున్నారు. ట్రంప్‌ ప్రజాస్వామ్యానికే ముప్పుగా బైడెన్‌ అభివర్ణించనున్నారు. అయితే తన వయసు 81 ఏళ్లు దాటం, మరో నాలుగేళ్లు అధ్యక్ష పదవి చేపట్టడం, మానసికంగా ఆయన ఫిట్ గా లేకపోవడం బైడెన్‌కు ప్రతికూల అంశాలు. ఈ ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెన్‌, 78 ఏళ్ల ట్రంప్‌ అంశం కూడా కీలకం కానున్నది. ఇటీవల జీ7 సమావేశం సహా పలు సందర్భాల్లో బైడెన్‌ గందరగోళానికి గురైన సంఘటలు జరిగాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపుబైడెన్‌ హయాంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, వలసలు రికార్డు స్థాయిలో ట్రంప్‌ ప్రశ్నించే అవకాశం ఉన్నది. ఈ అంశాలను లేవనెత్తి బైడెన్‌ను ఇరుకున పెట్టాలని ట్రంప్‌ భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు వృద్ధ నేతల మానసిక పరిస్థితికి ఈ చర్చ పరీక్ష కానున్నదనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది. 

Tags:    

Similar News