తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..పొంగిపొర్లుతున్న దుందుభి వాగు

తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కల్వర్టులు, రహదారులపై నుంచి వరద పోటెత్తడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

By :  Vamshi
Update: 2024-09-01 05:49 GMT

తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తిలో అత్యధికంగా 43.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షలతో ఉమ్మడి వరంగల్‌జిల్లా జలదిగ్బంధం అయింది. జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీపలు కాలనీలు జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రవాణా సౌకర్యం నిలిచిపోయాయి. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్‌ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రంతా వదలకుండా వాన పడడంతో జనజీవనం స్తంభించింది.

వరద భారీగా చేరడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండాను ఆకేరు వరద ప్రవాహం చుట్టుముట్టింది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో గ్రామస్తులు డాబాల పైకి ఎక్కి తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు.10 గంటలుగా ఓ బస్సులోనే ప్రయాణికులు చిక్కుకున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వేములవాడ నుంచి మహబూబాబాద్ శనివారం రాత్రి బయల్దేరిన ఆర్డీసీ బస్సు వరంగల్ జిల్లా వెంకటాపురం-తోపనపల్లి మధ్య నిలిచిపోయింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 10 గంటలుగా బస్సులోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేక చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.

అధికారులు స్పందించి తమను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని కోరారు. వరద నీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లలేని స్థితిలో ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రామగిరి - రఘుపతిపేటల మధ్య ఉప్పొంగి ప్రవహిస్తున్న దుందుభి వాగు .. కల్వకుర్తి - తెలకపల్లిల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయి. భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి, సహాయచర్యల్లో పాల్గొనాలని మాజీ మంత్రి సూచించారు.

Tags:    

Similar News