రైతు భరోసాకి సర్కార్ ఎగనామం!

మంత్రి తుమ్మలకు షాక్ ఇచ్చిన రైతులు

By :  Vamshi
Update: 2024-06-26 04:28 GMT

తెలంగాణలో రైతు భరోసా పథకానికి అనర్హులకు ఏరివేసేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. రాష్ట్రంలో 33 జిల్లాల నుండి రైతులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటగా గతంలో తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరు నుండి రైతులు మాట్లాడుతూ అయితే 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకించారు.మొదటగా గతంలో తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరు నుండి రైతులు మాట్లాడుతూ అయితే 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకించారు.

కనీసం 10 ఎకరాల వరకు ఇచ్చేలా నిబంధన పెట్టాలన్నారు. ఐటీ రిటర్న్స్ చెల్లింపుదారులకి రైతు భరోసా ఇవ్వము అనడం కరెక్ట్ కాదని వారు అన్నారు. చాలా మంది రైతులు, ఇంటి లోన్ కోసం, కారు లోన్ కోసం ఐటీ రిటర్న్స్ సమర్పిస్తారని రైతులు తెలిపారు. అన్ని జిల్లాల నుండి రైతులు దాదాపు ఇదే అభిప్రాయం చెప్పడంతో తుమ్మల కంగుతిన్నారు. ఇంతే కాదు రూ. 500 బోనస్ సన్న వడ్లకే కాదు దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాలని, కరెంట్ సరిగా రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రైతు బంధు పంటలు వేసే టైముకి ఇవ్వట్లేదని, ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఐటీ రిటర్న్స్ చెల్లించేవారికి రైతు భరోసా అందకుండా చేసేందుకు సర్కార్ విధివిధానాలు ఖరారు చేస్తోంది. బీడు భుములు, రోడ్డు, రియల్ వెంచర్లకూ ఈ స్కీమ్ వర్తింపుకూడదని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే 10 రోజుల్లోగా పూర్తిగా కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా ఇవ్వాలని కృషి చేస్తోంది కాగా, ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం వరకు సాగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ ఇంక సరే ఉంటా అంటూ 2 గంటల్లోనే ముగించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండ రెడ్డి, చిన్నారెడ్డి పాల్గోన్నారు.

Tags:    

Similar News