హైదరాబాద్‌లో కమిషనర్‌ అమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ కాటా ఆమ్రపాలి పాలనలో తనదైన శైలీలో దూకుడు పెంచారు.

By :  Vamshi
Update: 2024-07-03 15:22 GMT

జీహెచ్ఎంసీ కమిషనర్‌ అమ్రపాలి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారులతో కలిసి నారాయణగూడలో గల్లీల్లో పర్యటించి వివిధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె సరదాగా కాసేపు ముచ్చటించారు. ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మర్కెట్ కాంప్లెక్స్‌లో గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని జేసీని ఆదేశించారు.

శంకర్‌మఠ వద్ద రాంకీ ఆర్ఎఫ్‌సీ వెహికల్ డ్రైవర్‌తోనూ మాట్లాడారు. చెత్త తరలింపు వివరాలను అడిగి అమ్రపాలి తెలుసుకున్నారు. మరో స్కూల్ విద్యార్ధినికి పరిశుభ్రతపై కమిషనర్ అవగహన కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమె డిప్యూటేషన్‌పై మళ్లీ తెలంగాణకు వచ్చారు. రేవంత్ ప్రభుత్వంలో ఆమ్రపాలికి సరైన ప్రాధాన్యత దక్కింది. మొదట ఆమెను హెచ్ఎండీఏ కమిషనర్‌గా నియమించగా.. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించింది. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఛార్జ్ తీసుకున్న ఆమ్రపాలి నగర కమిషనర్‌గా తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. 

Tags:    

Similar News