మెగా, అల్లు ప్యామిలీల మధ్య కోల్డ్ వార్ ?

మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ దూరం !

Byline :  Vamshi
Update: 2024-06-12 11:26 GMT

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కేసరపల్లిలో జరిగిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారన్నికి అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదు. దీనికి తోడు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ట్వీట్టర్‌లో అల్లు అర్జున్‌ని అన్ ఫాలో చేశాడు. దీంతో ఊహాగానాలు నిజమయ్యాయి. మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరనే సంకేతాలు పంపుతున్నాయి. అయితే కుటుంబమంతా ఒక్కతాటిపైనే ఉందంటూ పైకి కలరింగ్ ఇస్తున్నారని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. తనకంటూ ఓ ఇమేజ్ ఉండాలని, మెగా హీరో ట్యాగ్‌లైన్ తనకు అక్కర్లేదన్నంట్లుగా అల్లు అర్జున్ గత కొంతకాలంగా వ్యవహరిస్తున్నారు.

కానీ ఆయన వ్యవహారశైలి అభిమానుల మధ్య విభేదాలకు కారణమవుతోంది. అల్లు అర్జున్ తన మామ పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇవ్వకుండా, నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు ఇచ్చాడు. దీంతో మెగా బ్రదర్ నాగబాబు ఘటుగా స్పందించారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే '' అంటూ నాగబాబు ట్వీట్ చేశాడు. ఒక వైపు తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, నా అనుకునే వాళ్లకు తప్పకుండా నా మద్ధతు ఉంటుందని అల్లు అర్జున్‌ స్పష్టం చేశారు.

శిల్పా రవి తనకు 15 ఏళ్లుగా ఫ్రెండ్ అని ఆయన రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ఊరుకి వచ్చి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చానని.. దీనిలో భాగంగానే భార్య స్నేహరెడ్డితో కలిసి వెళ్లి రవికి విషెస్ తెలిపినట్లు బన్నీ వివరణ ఇచ్చాడు. గతంలో సరైనోడు మూవీ సక్సెస్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ గురించి చెప్పమని మెగా అభిమానులు అడగ్గా.. 'చెప్పను బ్రదర్' అంటూ బన్నీ తెలిపారు. చిరంజీవి వల్లే అల్లు అర్జున్ ఎదిగారనేది ఎంత నిజమో.. అల్లు రామలింగయ్య వల్లే చిరంజీవి ఇండస్ట్రీలో హీరోగా మనుగడ సాధించారనేది కూడా అంతే నిజమని మెగా హీరోలు గుర్తుంచుకోవాలని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు.మరి మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య సాగుతున్న ఈ కోల్డ్ వార్‌కు ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.

Tags:    

Similar News