సబితపై సీఎం అనుచిత వ్యాఖ్యలు

రేవంత్‌రెడ్డి తనను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.

By :  Raju
Update: 2024-07-31 08:51 GMT

రేవంత్‌రెడ్డి తనను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రేవంత్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి సంతోషంగా ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎంకు తనపై కక్ష ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆశాకిరణం అవుతాడని, సీఎం అవుతాడని కూడా చెప్పాను. మనస్ఫూర్తిగా రేవంత్‌రెడ్డిని ఆశీర్వదించానని తెలిపారు. ఇప్పడే కాదు ఎన్నికల సమయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మమ్మల్ని నమ్ముకుంటే మోసం చేస్తారని సీఎం అనడంపై సబితా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ తనపై ఎందుకు కక్ష తీర్చుకుంటారో అర్థం కావడం లేదని,ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా అని ఆవేదన వ్యక్తం చేశారు. తనను నమ్మకుంటే రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాను. బీఆర్‌ఎస్‌ కాకి తన ఇంటిపై వాలినా కాల్చివేస్తాన్న సీఎం మా పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.

సభను పక్కదోవ పట్టించడానికి సీఎం ప్రయత్నం చేసినట్టు కనిపించింది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సీఎం సబ్జెక్టుపైన కాకుండా కేసీఆర్‌ కుటుంబంపై అవాకులు చెవాకులు పేలడం చూస్తున్నదే. ఇవాళ కూడా ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, అసత్య ప్రచారాలను ఎండగట్టారు. కేటీఆర్‌ మాట్లాడుతుండగానే సీఎం, మంత్రులు, కాంగ్రెస్‌ రన్నింగ్‌ కామెంట్స్‌ మొదలుపెట్టారు. కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టడానికి సీఎం యత్నించి విఫలమయ్యారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సభ ఉద్రిక్తంగా మారింది.

సబితక్క తనన పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమంటూనే.. వ్యక్తిగతంగా జరిగిన సంభాషణ సభలో చెప్పారు అన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీగా తనను పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరిందని, పోటీ చేస్తే అండగా ఉంటానన్న అక్క తన పేరు ప్రకటించాక పార్టీ మారారు. అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి బీఆర్‌ఎస్‌లో మంత్రి పదవి తీసుకున్నారు. తమ్ముడిగా తనను మోసం చేశారు కాబట్టే కేటీఆర్‌ను నమ్మవద్ద చెప్పానని తన అక్కసు వెళ్లగక్కారు. సీఎం అనుచిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళనకు చేపట్టారు. దీంతో స్పీకర్‌ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. సభలో గందరగోళం సృష్టించి తాను కొత్త గవర్నర్‌ ప్రమాణ స్వీకారం ఉన్నదని, ఆయనను రిసీవ్‌ చేసుకోవడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నానని సభ నుంచి జారుకున్నారు. సమస్య సృష్టించిన సీఎం సభను వెళ్లిపోతే దాన్ని సమాధానం, సర్దిచెప్పే బాధ్యత శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు తీసుకున్నారు. ఇది ఇవాళలే జరిగింది కాదు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్నది ఇదే.

సీఎం ఆందోళన వెనుక అసలు ఆంతర్యం ఏమిటి అంటే బడ్జెట్‌ సమావేశాలలోపే బీఆర్‌ఎస్‌ ఎల్పీని విలీనం చేసుకోవాలని భావించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్‌ఎస్‌ను బలహీనపరచడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా సీఎం అనుకున్నది ఆచరణలో సాధం కాలేదు. పైగా ఇప్పటిరకు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ లో చేరిన వాళ్లు పునరాలోచనలో పడ్డారని, నిన్న సీఎం సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ప్రకటించడం రేవంత్‌కు మింగుడు పడలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే తన పతారా పోతుందనే ఆక్రోశం ఆయన మాటల్లో కనిపిస్తున్నది. అందుకే సభలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అసందర్భ విషయాలను సభలో ప్రస్తావిస్తున్నారు. సభా నాయకుడిగా ఉండి సభలో రన్నింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నాడు. మొత్తానికి సభలో సీఎం వ్యవహారశైలి వివాదాస్పదమౌతున్నది.

Tags:    

Similar News