భారతీయుడు 2 బుకింగ్స్‌ షురూ..టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు 2 చిత్రం జులై 12న తమిళం, తెలుగుతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలవుతుంది.

By :  Vamshi
Update: 2024-07-10 12:18 GMT

ప్రముఖ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భారతీయుడు 2. జులై 12న ప్రేక్షకుల ముందుకొస్తుంది ఈ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లో 75 రూపాయలతో పాటు సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవాలంటే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేయాలని హీరో, హీరోయిన్లతో వీడియోలు రిలీజ్ చేయించాలని కోరారు. అందులో భాగంగా ఈ సినిమాలో నటించిన కమల్ హాసన్, సిద్ధార్థ, సహ సముద్ర ఖని వంటి వాళ్ళు డ్రగ్స్ వినియోగం తప్పంటూ వీడియో రిలీజ్ చేశారు. అదేవిధంగా ఉదయాన్నేఎక్స్ ట్రా షో వేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది ప్రభుత్వం.

తెలంగాణలో ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ప్రభుత్వ ఆఫీసులో కలెక్టర్ నుంచి క్లర్క్ వరుకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. 1996లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ గా వస్తోన్న లేటెస్ట్ భారతీయుడు 2 మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ ఫిల్మ్గా తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలోలో కాజల్‌ అగర్వాల్‌,సిద్ధార్థ్‌,రకుల్‌ప్రీత్‌ సింగ్‌,బాబీ సింహా,సముద్రఖని తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..ఈ నేపథ్యంలో తొలిరోజే ఈ సినిమా దాదాపు రూ.150 కోట్లకు పైనే రాబట్టే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ సినిమా మొదలెట్టడం కూడా నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగింది, కానీ వివిధ కారణాలతో చిత్రీకరణ సరిగ్గా చేసుకోక ఆగిపోయింది. ముందుగా నిర్మాతలు మారారు, ఆ తరువాత కోవిడ్ రావటం, తరువాత చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరగటం ఇలా ఈ సినిమా నిజంగానే సినిమా కష్టాలు పడి చివరికి విడుదల ఈ శుక్రవారం అవుతున్న సమయానికి, ఇంకొక అవాంతరం ఎదురయ్యింది. 'భారతీయుడు 2' సినిమాపై మధురై కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ సినిమాని థియేటర్స్, ఓటిటి లో ఎక్కడా విడుదల కాకుండా నిషేధించాలని అతను తన పిటిషన్ లో పేర్కొన్నారు.భారతీయుడు' సినిమాలో ఈ మర్మకళ టెక్నిక్ ని తనకి చెప్పి చేశారని, ఇప్పుడు ఈ 'భారతీయుడు 2' లో తన అనుమతి తీసుకోకుండా ఆ కళని ఉపయోగించారని రాజేంద్రన్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు

Tags:    

Similar News