వేతనాలు పెంచాలని డీఎంఈ ఆఫీస్ ఎదుట ఆశా కార్యకర్తల నిరసన

ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆశా వర్కర్ల న్యాయబద్దమైన డిమాండ్లకు మద్దతుగా, కోఠిలో డీఎంఈ కార్యాలయం ముందు బిజెపి మహిళా మోర్చా ధర్నా నిర్వహించారు.

By :  Vamshi
Update: 2024-06-18 10:05 GMT

రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తల వేతనాలను 18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ డీఎంఈ కార్యలయం ఎదుట బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. చాలీచాలని శాలరీలతో ఆశాలు అనేక కష్టాలు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పనిభారం తగ్గించి పెరిగిన రేట్లకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు ఉద్యమిస్తామని డిమాండ్ చేశారు. మహిళా మోర్చ నేతలను పోలీసుల అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో మహిళా మోర్చా నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా ఇవ్వని పెండింగ్‌లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆశావర్కర్ల జీతం రూ. 9 వేల నుంచి 18 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జీతాల పెంపు హామీ నెరవేర్చలేదని ఇకనైనా ఆశావర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News