పరీక్షలు వాయిదా వేయాలని నిరసన చేస్తున్న నిరుద్యోగుల అరెస్ట్‌

డీఎస్సీ, గ్రూప్‌-2 వాయిదా వేయాలని కోరుతూ.. అశోక్‌నగర్‌లో ధర్నా చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 10 మందిని అరెస్ట్‌ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు.

By :  Raju
Update: 2024-07-14 05:46 GMT

డీఎస్సీ, గ్రూప్‌-2 వాయిదా వేయాలని కోరుతున్న నిరుద్యోగుల డిమాండ్లపై స్పందించకుండా పుండు మీద కారం చల్లినట్టు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. దీంతో నిన్న చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వరకు నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌పైనే బైఠాయించి నిరనన తెలిపారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నిరుద్యోగులు ఆందోళన చేశారు.శాంతియుతంగా ఆందోళన చేయడాన్ని రేవంత్‌ ప్రభుత్వం పెద్ద నేరంగా పరిగణిస్తున్నది. అశోక్‌నగర్‌లో ధర్నా చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 10 మందిని అరెస్ట్‌ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు.

నిరుద్యోగులు డీఎస్సీ, గ్రూప్‌-1 వాయిదా వేయాలని ఆందోళన చేస్తుంటే సీఎం మాత్రం దీక్ష చేసిన ఒక్కరూ పరీక్షలు రాయడం లేదని, అందులో ఒకరు కోచింగ్‌ సెంటర్‌ యజమాని అని , ఇంకో ఆయన మన పార్టీలోనే ఉండె కదా (బక్క జడ్సన్‌ను ఉద్దేశించి) ఆయన ఎందుకు దీక్ష చేస్తున్నాడని, తను పార్టీలో ఏ ఉద్యోగం ఇవ్వలేదని, నన్ను గిల్లడానికే దీక్ష కూర్చున్నాడని ఇలా నిన్న అడ్డగోలుగా మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై ఇప్పటికే నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఓయూలో, ఆర్టీసీ క్రాస రోడ్‌లో నిరసనలు చేస్తున్నారు. సీఎం డౌన్‌ డౌన్‌, ప్రభుత్వ మొండి వైఖరి వీడాలని, వీ వాంట్‌ జస్టిస్‌, గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని నినదిస్తున్నారు. నిర్బంధాలు, అణచివేతలు, అరెస్టులతో నిరుద్యోగుల నిరసనలను కట్టడి చేయలేరని అంటున్నారు.ఓయూలోనూ నిరసన చేస్తున్న విద్యార్థులను హాస్టళ్లలోకి వెళ్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని ముగ్గురు నలుగురు పోలీసులు కలిసి ఎత్తుకొచ్చి పోలీస్‌ వాహనంలోకి ఎక్కించారు. సమైక్య పాలనలోనూ ఇంత నిర్బంధం చూడలేదంటున్నారు.

Tags:    

Similar News