నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం నేడు

రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కళా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్‌ భేటీకి పలు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు.

By :  Raju
Update: 2024-07-27 04:13 GMT

ఢిల్లీలో నీతిఆయోగ్‌ 9వ పాలకమండలి సమావేశం నేడు జరగనున్నది. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కళా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి పలు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు.2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి అవసరమైన విజన్‌ డాక్యుమెంట్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, గ్రామీణ, పట్టణ వాసుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పాలక మండలి చర్చించనున్నది.

కేంద్ర బడ్జెట్‌లో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని కర్ణాటక, హిమాచల్‌, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు సిద్ధరామయ్య, సుఖ్విందర్‌ సింగ్‌ సుఖూ, రేవంత్‌రెడ్డిలు నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌, కేరళ సీఎం పినయయి విజయన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ లు కూడా హాజరుకావడం లేదని ప్రకటించారు. నీతి ఆయోగ్‌ భేటీలో పాల్గొనడానికి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ చేరుకున్నారు. నీతిఆయోగ్‌ను రద్దు చేసి ప్రణాళికాసంఘాన్ని పునరుద్ధరించాలని ఆమె డిమాండ్‌ చేశారు. నీతి ఆయోగ్‌కు ఆర్థికపరమైన ఆధారాలు లేకపోయినా జాతీయస్థాయిలో బెంగాల్‌ గళాన్ని వినిపించడానికే భేటీకి హాజరుకావాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

Tags:    

Similar News