దేశంలోనే రిచ్చెస్ట్ గణపతి ముంబయిలో

66 కేజీల బంగారం, 325 కేజీల వెండి నగలతో గణపయ్యకు అలంకరణ.. రూ.400 కోట్లతో ఇన్సూరెన్స్‌

Update: 2024-09-07 11:41 GMT

దేశంలోనే రిచ్చెస్ట్‌ గణపయ్య ముంబయిలో కొలువుదీరాడు. ముంబయిలోని జీఎస్‌బీ సేవ మండల్‌ ఈ గణపతిని వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించింది. మన ఖైరతాబాద్‌ గణపతి ఉత్సవ సమితి తరహాలోనే జీఎస్‌బీ సేవ మండల్‌ ఈ ఏడు 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈక్రమంలోనే ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. గణపతి విగ్రహానికి 66 కేజీల బంగారం, 325 కేజీల వెండి నగలతో అలంకరించారు. సేవ మండల్‌ ఉత్సవాల కోసం గణపతి మండపాన్ని రూ.400.58 కోట్లతో ఇన్సూరెన్స్‌ చేయించింది. ఐదు రోజుల పాటు పూజల అనంతరం ఈ గణపతి విగ్రహాన్ని సేవ మండలి నిమజ్జనం చేయనుంది. రిచ్చెస్ట్‌ గణపతి దర్శనానికి వచ్చే భక్తుల గుర్తింపునకు ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిరుడు కూడా జీఎస్‌బీ సేవ మండల్‌ అత్యంత వైభవంగా గణపతి ఉత్సవాలను నిర్వహించింది. నిరుడు రూ.360.40 కోట్లతో మండపానికి ఇన్సూరెన్స్‌ చేయించింది. 

Tags:    

Similar News