కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్‌..ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే

ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ పై స్టే విధించింది.

By :  Raju
Update: 2024-06-21 06:38 GMT

ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ పై స్టే విధించింది. కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి గురువారం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ ఇచ్చే క్రమంలో ట్రయల్‌ కోర్టు తమ వాదనను పరిగణలోకి తీసుకోలేదని, కనీసం 48 గంటల గడువు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని చెప్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు బెయిల్‌ పై స్టే విధించింది. ట్రయల్‌ కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో శుక్రవారం కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదలవుతారని అంతా అనుకుంటున్న క్రమంలోనే హైకోర్టు ఊహించని షాక్‌ ఇచ్చింది. కేజ్రీవాల్‌కు బెయిల్‌ తాము విచారణ పూర్తి చేసే వరకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను నిలుపుదల చేసింది. దీంతో హైకోర్టు బెయిల్‌ మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే తప్ప కేజ్రీవాల్‌ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.



Tags:    

Similar News