అన్ణుమన్ గైక్వాడ్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు.
By : Raju
Update: 2024-08-01 03:56 GMT
భారత క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు. కొన్నేళ్లుగా రక్త క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
గైక్వాడ్ కొన్ని నెలల పాటు లండన్‌లో చికిత్స పొందారు. గత నెలలో స్వదేశానికి వచ్చి బరోడాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స కొనసాగించారు. కపిల్‌దేవ్ సహా పలువురు మాజీ క్రికెటర్ల విజ్ఞప్తి మేరకు గైక్వాడ్ చికిత్స కోసం కొన్ని రోజుల కిందటే బీసీసీఐ రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించింది.
1983లో వరల్డ్ కప్ నెగ్గిన టీమ్‌లో సభ్యుడైన గైక్వాడ్ 1974-84 మధ్య 40 టెస్టులు, 15 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. గైక్వాడ్ 1997-99 మధ్య టీమిండియాకు కోచ్‌గా పనిచేశారు.