ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మార్చి 16 నుంచి తీహార్ జైలులో ఉన్న ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

By :  Vamshi
Update: 2024-08-27 07:35 GMT

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మార్చి 16 నుంచి తీహార్ జైలులో ఉన్న ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్ట్ సబ్మిట్ చేయాలని ఎమ్మెల్సీ కవితకు కోర్టు ఆదేశించింది. దేశం విడిచి వెళ్లరాదని కోర్టు సూచిందింది. రెండు కేసుల్లో రూ.10 లక్షల పూచీకత్తుపై బెయిల్ లభించింది. ఈ మేరకు కవిత తరఫున ప్రముఖ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించగా.. ఈడీ తరఫున ఎస్వీ రాజు తన వాదిస్తున్నారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని ముకుల్ రోహత్గీ అన్నారు. ఈడీ, సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లపై ఇప్పటికే విచారణ పూర్తైందని తెలిపారు.

ఈ కేసులో రూ.100 కోట్లు చేతులు మారాయనడం కేవలం ఆరోపణలేనని ధర్మాసనానికి వివరించారు. కవిత ఎవరినీ బెదిరించలేదని ఈడీ, సీబీఐ కేసులో ఆమె గత ఐదు నెలలుగా జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 493 మంది సాక్షుల విచారణ కూడా ముగిసాయని కేసులో ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే న‌మ్మ‌కంతో బీఆర్ఎస్ 25 మంది ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు..మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆధ్వర్యంలో గ్రాండ్ వెల్కమ్‌ చెప్పానున్నారు

Tags:    

Similar News