ప్రభాస్ కల్కి 2898AD సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 6గంటలకు విడుదల చేయునున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందు కోసం తెలుగు రాష్ట్రాలు, దేశంలోని పలు థియేటర్లను ఎంపిక చేసింది. కల్కి 2898AD ప్రపంచంలోకి స్వాగతం అంటూ ఈ మేరకు పోస్టర్లను పంచుకుంది. అగ్ర కథానాయకుడు ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదలకు ఇంకా నెల రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్ పాల్గోంటుంది కల్కి టీమ్. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మరోవైపు ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రైలర్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనితో పాటు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు.