గ్రాండ్​గా అనంత్‌-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట ప్రీవెడ్డింగ్ వేడుకలు గ్రాండ్​గా జరుగుతున్నాయి. అంబానీ నివాసంలో 'మామెరు' వేడుక జరిగింది.

By :  Vamshi
Update: 2024-07-04 15:15 GMT

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో నేడు మమోరు వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా ముంబైలో మంగళవారం సామూహిక వివాహ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్ధాపక చైర్‌పర్సన్ నీతా అంబానీ హాజరయ్యారు. సామూహిక వివాహాలతో ఇవాళ అనంత్‌, రాధిక శుభలగ్న వేడుకలు ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

వేదాశ్సీసులతో ఒక్కటైన నవ జంటలను ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉందని, కొత్త జంటలకు తాను ఆశీస్సులు అందించానని చెప్పారు. 50 మంది నిరుపేద జంటలకు ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దగ్గరుండి మరీ వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఇక జులై 12న ముంబై బాంద్రాలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో అనంత్‌, రాధిక మర్చంట్‌ పెళ్లి అట్టహాసంగా జరగనుంది. ఈ వివాహానికి కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేపట్టారు. పెండ్లి పత్రికను ఇటీవల నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత ఆర్భాటంగా నిర్వహించే ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల నుంచి అత్యంత ప్రముఖులు హాజరుకానున్నారు.


అనంత్-రాధిక వివాహ షెడ్యూల్:

అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ పెళ్లి షెడ్యూల్ బయటకు వచ్చింది. ఈ కార్యక్రమం మొత్తం 12 నుంచి 14వ తేదీ వరకు జరగనుంది.

1.జూలై 12: ఈ రోజు అనంత్ రాధిక వివాహ వేడుక. ఈ రోజున ఇద్దరూ ఆచారాలతో వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే రోజు ప్రధాన వివాహ వేడుకకు అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించనున్నారు.

2. జూలై 13: శుభ అస్బర్వాద్ లేదా దైవిక ఆశీర్వాద కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భారతీయ దుస్తులు కోడ్ అధికారికంగా ఉంటుంది.

3. జూలై 14: మంగళ్ ఉత్సవ్ అంటే వివాహ రిసెప్షన్ ఈ రోజున ఉంటుంది. దీనికి చిక్ థీమ్ డ్రెస్ కోడ్ ఫిక్స్ చేయబడింది.

Tags:    

Similar News