యూజీసీ- నెట్‌ జూన్‌ 2024 పరీక్ష రద్దు

ఎన్‌టీఏమంగళవారం (జూన్‌ 18)న నిర్వహించిన యూజీసీ-నెట్‌ 2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈపరీక్షలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం మేరకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

By :  Raju
Update: 2024-06-20 03:27 GMT

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం (జూన్‌ 18)న నిర్వహించిన యూజీసీ-నెట్‌ 2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈపరీక్షలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం మేరకు దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దేశ వ్యాప్తంగా వివిధ నగరా్లలో రెండు షిప్టుల్లో ఓఎంఆర్‌ (పెన్ను, పేపర్‌) పద్ధతిలో యూజీసీ నెట్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ సైబర్‌ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ఐసీసీసీసీ)కి చెందిన జాతీయ సైబర్‌ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి నివేదిక ఇచ్చింది.

అందులోని వివరాల ప్రకారం పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్ధారించింది. దీంతో పారదర్శకత, విశ్వసనీయత కోసం పరీక్షను రద్దు చేస్తున్నామని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.

యూజీసీ నెట్‌ పరీక్షకు సుమారు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీల్లో అడ్మిషన్ల కోసం, వర్సిటీల్లో, కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలకు అర్హత సాధించడానికి ఈ పరీక్షను నిర్వహిస్తున్నది.

గతంలో ఆన్‌లైన్‌ విధానాలో నెట్‌ పరీక్ష ను నిర్వహించిన ఎన్టీఏ ఈసారి ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించింది. పరీక్ష కేంద్రంలోని పెన్‌ కూడా అనుమతించలేదు. నాలుగైదు చోట్ల తనిఖీలు చేసిన తర్వాతే పరీక్ష హాల్‌లోకి అనుమతించింది. హాల్‌ టికెట్‌పై ఒక ఫొటో, పరీక్షకు హాజరైనట్టు నిర్ధారించడానిక బయోమెట్రిక్‌తో పాటు తీసుకున్నది. అన్నీ జాగ్రత్తగా పరిశీలించింది. యూజీసీ నిబంధనల మేరకు వాటిలో ఏది తక్కువగా ఉన్న అండర్‌ టేకింగ్‌ ఫామ్‌పై సంతకం తీసుకున్నది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా పరీక్షల్లో అవకతవకలు జరగడంపై పరీక్ష అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు వైద్య విద్య కోర్సుల్లో అడ్మిషన్ల కోసం మే 5 న నిర్వహించిన నీట్‌ పేపర్‌ లీకేజీపై వస్తున్న ఆరోపణలపైనా కేంద్రం స్పందించింది. సమమం కోల్పోయిన విద్యార్థులను కలిపిన గ్రేస్‌ మార్కులను రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పాట్నాలో నీట్‌ అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని పేర్కొన్నది. ప్రాథమిక ఆధారాల ప్రకారం నీట్‌లో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చామని బీహార్‌ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపింది. 

Tags:    

Similar News