భారీ లాభాల్లో స్టాక్మార్కెట్లు
శుక్రవారం దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో సాగుతున్నాయి.
By : Raju
Update: 2024-08-16 07:22 GMT
శుక్రవారం దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో సాగుతున్నాయి.ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 805 పాయింట్లు, నిఫ్టీ 252 పాయింట్ల మేర లాభపడ్డాయి. దాదాపు అన్నిరంగాలూ మంచి లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండటమే దీనికి కారణం.
మధ్యాహ్నం 12.32 గంటల సమయానికి సెన్సెక్స్ 985 పాయింట్లకు పైగా లాభంతో 80,092 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 280 పాయింట్లకు పైగా లాభంతో 24,425 వద్ద ట్రేడ్ అవుతున్నది.