స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య అప్రమత్తత పాటిస్తున్న మార్కెట్లు

By :  Raju
Update: 2024-09-05 04:55 GMT

దేశీయ మార్కెట్‌ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య మార్కెట్లు అప్రమత్తత పాటిస్తున్నాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 142 పాయింట్లు పెరిగి 82,489 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 42.60 పాయింట్లు పెరిగి 25,245 వద్ద ట్రేడవుతున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.97 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 72.08 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. బంగారం ఔన్సు ధర 2,526.40 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

సెన్సెక్స్‌-30 సూచీలో అల్ట్రా టెక్‌ సిమెంట్, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, అపోలో హాస్పిటల్స్‌, హిందాల్కో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, కోలిండియా, హీరో మోటార్స్‌, నెస్లే భారతీ ఎయిర్‌టెల్‌, బ్రిటానియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News