పెట్రో ధరలపై త్వరలోనే గుడ్‌ న్యూస్‌

ధరలు తగ్గించే యోచన కేంద్ర ప్రభుత్వం

Update: 2024-09-06 08:27 GMT

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పబోతోంది. క్రూడాయిల్‌ ధరలు భారీగా తగ్గడంతో దేశీయంగా పెట్రో ధరలను తగ్గించాలని కేంద్రం ఆలోచన చేస్తుంది. 2022లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 115 డాలర్లుగా ఉండగా ప్రస్తుతం 70 డాలర్లకు తగ్గింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పెట్రో ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరను సుమారు రూ.5 వరకు తగ్గించవచ్చని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రో, డీజిల్‌ ధరలను కేంద్రం ప్రభుత్వం లీటర్‌కు రూ.5 వరకు తగ్గించింది. ఇప్పుడు మళ్లీ తగ్గించాలనే ప్రయత్నాల్లో ఉంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం ప్రకటించవచ్చని తెలుస్తోంది.

Tags:    

Similar News